
జనం న్యూస్ 10 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులుగద్వాల జోగుళాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయం పరిసరాల్లో నిర్వహిస్తున్న ఆన్లైన్, జిరాక్స్ సెంటర్ల సేవలు నిలిచిపోవడంతో రవాణాశాఖకు వచ్చే వాహనదారులు,వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.డ్రైవింగ్ లైసెన్స్,వాహన రిజిస్ట్రేషన్ ఇతర ఆన్లైన్ సేవలకు సంబంధించి ప్రజలు ఈ కేంద్రాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో సేవలు నిలిచిపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారని పలువురు వాపోతున్నారు.ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకుల ఆరోపణల ప్రకారం రవాణాశాఖ అధికారులు, సిబ్బంది తమపై తరచూ ఒత్తిడి,వేధింపులకు పాల్పడుతున్నారని చిన్నచిన్న కారణాలను చూపుతూ కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొంటున్నారు.ఇటీవల ఓ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుడిని ఓ హోంగార్డు బెదిరించడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్లు వారు చెబుతున్నారు.మాపై దౌర్జన్యం చేసి మళ్లీ మాపైనే కేసులు పెడుతున్నారు అంటూ ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రవాణాశాఖ కార్యాలయానికి వచ్చే వినియోగదారుల నుంచి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు.అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ తరచూ ఏదో ఒక కారణంతో తమపై కేసులు పెడుతున్నారని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.తమకు న్యాయం జరిగే వరకు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు రవాణాశాఖ ఆదాయానికీ నష్టంఆన్లైన్ సర్వీస్,జిరాక్స్ కేంద్రాలు మూసివేయడంతో ప్రజలకు ఇబ్బందులు కలగడమే కాకుండా రవాణాశాఖకు సంబంధించిన పలు సేవల నిర్వహణలో అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు అంటున్నారు.సేవలు అందుబాటులో లేకపోవడంతో రవాణాశాఖకు వచ్చే ఆదాయంపైనా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రవాణాశాఖ అధికారులు ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకుల మధ్య నెలకొన్న వివాదాన్ని వెంటనే పరిష్కరించి ప్రజలకు సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.