
జనం న్యూస్ 17 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అలంపూర్ సోషల్ మీడియా ఇటీవల జరిగిన రాజోలి సిల్క్ సొసైటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కోల్కర్ రహీం ఏకగ్రీవంగా రాజోలి సిల్క్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన ఈరోజు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్. ఎస్.ఏ.సంపత్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ నూతన అధ్యక్షుడు కోల్కర్ రహీంకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సిల్క్ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తూ రైతులు సభ్యుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో రాజోలి సర్పంచ్ గంగిరెడ్డి, రాజోలి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దస్తగిరి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి హసన్ మాలిక్ భాష, వంక మహేష్ గోపి తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.