
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం సెప్టెంబర్ 5. 09. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలో తన పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో పదవి బాధ్యతలను స్వీకరించినట్లు ఆయన వెల్లడించారుసందర్భంగా కృతజ్ఞతలు
తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) అధ్యక్షునిగా తనపై నమ్మకం ఉంచి రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, నగీనా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, జాతీయ అధ్యక్షులు వినయ్ రతన్ సింగ్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర భీమ్ ఆర్మీ అధ్యక్షుడు తెలిపారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని, ఇకపై తన ప్రతి అడుగు ప్రజా సేవకే అంకితం చేస్తానని స్పష్టం చేశారు. తనకు అప్పగించిన రాష్ట్రస్థాయి పదవిని అధికారానికి ప్రతీకగా కాకుండా ప్రజాసేవకు లభించిన పవిత్రమైన అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రజల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని, సమాజంలోని ప్రతి వర్గం హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్క పౌరుడిని బలోపేతం చేయడం తన ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భీమ్ ఆర్మీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని, అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రస్థాయి అధికార బాధ్యతలు అప్పగించిన చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, వినయ్ రతన్ సింగ్‌లకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు