
జనం న్యూస్ జూన్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన శ్రీ హేమ దుర్గా భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహభరిత వాతావరణంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత సాధికారత కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో కృషి చేయాలని, రాహుల్ గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా విభాగం ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మైనారిటీ, ఎస్సీ సెల్, బీసీ సెల్, సేవాదళ్, సోషల్ మీడియా విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలు కూకట్పల్లి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, పార్టీ ఆశయాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి పనిచేస్తామని నాయకులు స్పష్టం చేశారు.