

బిచ్కుంద సెప్టెంబర్ 3( జనం న్యూస్)కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని హస్గుల్ గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియలో ఆర్డీవో రవీందర్ రెడ్డి మరియు బిచ్కుంద తహసీల్దార్ వేణుగోపాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఆర్డీవో రవీందర్ రెడ్డి తాసిల్దార్ వేణుగోపాల్ స్వయంగా ఒక పట్టాదారు పొలాన్ని మొదలు నుండి చివరి వరకు సర్వే చేసి, తుది పాలిగాన్ను ఏర్పాటు చేసి, పట్టాదారు వివరాలను సిస్టమ్లో సేవ్ చేశారు.ఈ సందర్భంగా రీ-సర్వే పనులు వేగవంతంగా, కచ్చితంగా జరిగేలా సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ హనుమాన్లు సర్వేర్ గ్రామ సర్పంచ్ ఏక్ బాల్ ఉనీసా బేగం నయం పటేల్ తాసిల్దార్ సిబ్బంది గ్రామ ప్రజలు వ్యవసాయదారులు తదితరులు పాల్గొన్నారు