
జనం న్యూస్ | ఆగస్టు 06 | జగిత్యాల జిల్లా, మెట్‌పల్లిమెట్‌పల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామపంచాయతీ గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) రాజేష్ రూ.5 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఆత్మకూరు గ్రామానికి చెందిన మల్లేష్ తన పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేయించుకోవడానికి జీపీఓ రాజేష్‌ను సంప్రదించాడు. పని చేయాలంటే రూ.5 వేల లంచం ఇవ్వాలని రాజేష్ డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని, నిర్ణీత ప్రదేశంలో మల్లేష్ నుంచి రూ.5 వేల లంచం స్వీకరిస్తుండగా రాజేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లంచం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆత్మకూరు గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత ఫైళ్లు, రికార్డులు, ఇతర పత్రాలను పరిశీలించి సీజ్ చేశారు.నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లేదా ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.