
జనం న్యూస్ 10 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ రాజ్యాధికారం పార్టీ సింధనూర్ ఉప్పరి.గంగాధర్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని సిందనూరు గ్రామం నుండి మొదలుకొని అల్లంపూర్ లాస్ట్ ఆయకట్టు వరకు నీరు పారాల్సిన ఆర్డీఎస్ కెనాల్ లోకి చుక్కనీరు వదలని కర్ణాటక ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్‌కు రైతుల గోస వినపడదా. ఈరోజు తుంగభద్ర జలాశయం నీటి మట్టం 10-08-2026 ఉదయం 7 AM వరకుప్రవాహం ఇన్ఫ్లోన్ -43,017 క్యూసెక్కులు విడుదల అవుట్ ఫ్లోర్ -1,753 క్యూసెక్కులు నీటి నిల్వ -79.2 టీఎంసీలు గరిష్ట నీటి సామర్థ్యం -105 పిఎంసీలు 24 గంటల్లో నిన్న 7 గంటల నుండి ఈరోజు 7 గంటల వరకు పెరిగిన టీఎంసీలు 3.56 తుంగభద్రాలో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ మరియు కర్ణాటక గవర్నమెంట్ చర్య తీసుకుని రైతులకు తాగునీరు. సాగునీరు. అందించాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ గద్వాల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూరు ఉప్పరి. గంగాధర్, ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే కొన్ని వేల ఎకరాలకు సాగునీరు లక్షల మందికి త్రాగునీరు ఇప్పటికైనా విడుదల చేయాలని కోరడమైనది. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరచి రైతులను ఆదుకోవాలి. లేకపోతే ఆర్డీఎస్ నీరు పారుతున్న ప్రతి గ్రామాల నుండి రైతులు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం అయినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అయిజ మండల ఉపాధ్యక్షుడు భీమేష్ సలహాదారుడు బసవ సామి గ్రామ రైతులు దేవేందర్ రెడ్డి జలాలుద్దీన్ ప్రాణేష్, అమరేష్ టైలర్ సిద్ధప్ప కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.