
జనం న్యూస్ జూన్ 9 ముమ్మిడివరం : రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వారు పిలుపుమేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన తరుణంలో ప్రజలకు మోసపూరిత హామీ ఇచ్చిన తరుణంలో కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు కార్యక్రమాన్ని చేపట్టింది. వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి వారు ఆదేశాల మేరకు ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో పల్లెపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాయకులు చిట్టి రాజు నిర్మించిన కళ్యాణ మండపంలో నియోజకవర్గ ఇన్చార్జ్ పొన్నాడ సతీష్ కుమార్ వారు ఆధ్వర్యంలో జరిగిన సభలో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సిఇసి) సభ్యులు పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో అండగా ఉంటానని అన్నారు. రాబోయే రోజుల్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనం అందరం పార్టీని పూర్తిస్థాయిలో బలోపితం చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని సమయుక్తులై సిద్ధంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమానికి, రాష్ట్ర కార్యదర్శి మరియు నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీను , రాష్ట్ర నాయకులు చిట్టిరాజు ,,, రాష్ట్ర కార్యదర్శి నడింపల్లి సూరిబాబు రాజు ,,సి ఎస్ సి సభ్యురాలు కాశి బాలముని కుమారి , మరియుఈ సదస్సుకు నియోజకవర్గ నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు,మండల నాయకులు, కార్యకర్తలు, నియోజవర్గ వైయస్సార్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు వివిధ అనుబంధ కమిటీల సభ్యులు జడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచులు గ్రామస్థాయి వివిధ విభాగాల అనుబంధ కమిటీ నాయకులు మహిళా నాయకులు అభిమానులునాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.