
జనం న్యూస్ జూన్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చెందిన రైతు ఆర్ టి ఎన్ రే ఖ పల్లి దుర్గాప్రసాద్ నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారిని కలిసి వృక్షాలను రీ ప్లాంటింగ్ చేసే విషయం మీద చర్చించటం జరిగింది రోటరీ ఐకాన్ చేసిన అనేక వృక్షముల రీ ప్లాంటేషన్ గురించి వివరముగా వివరించి చెప్పటమైనది ఐకాన్ చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ వారు ఎంతో అభినందించినారు … త్వరలో ప్రభుత్వం తరఫున కూడా చేసే రీ ప్లాంటింగ్ లో మీ సహాయ సహకారాలు ఇప్పించ వలసిందిగా కోరినారు.. ఐకాన్ రోటరీకి ఇది ఎంతో మంచి ఆనందించవలసిన విషయము. ఈ సందర్భంగా ఆర్ టి ఎన్ రేఖపల్లి దుర్గాప్రసాద్ క్లబ్బు కు ఎంతో మంచి పేరు తెస్తున్నందుకు క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ ఆర్ టి ఎన్ తీగెల రాజా అభినందించిన్నారు.