
జనం న్యూస్, సెప్టెంబర్ 10,అచ్యుతాపురం: బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై చేసిన ఒప్పందాలను ఆమోదించాలని కోరుతూ సెప్టెంబర్ 11న జరిగే బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొని డిమాండ్లు పరిష్కారానికై తమ వంతు కృషి చేస్తుందని సీఐటీయూ నాయకులు తెలిపారు. అనకాపల్లిలో ఉన్న అన్ని బ్యాంకులలో ఈరోజు ఉదయం నుంచి ఉద్యోగులకు సమ్మెకు సంబంధించిన కరపత్రాన్ని పంపిణీ చేసి తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు యూనియన్లు ఇచ్చిన పిలుపు లో భాగంగా యూనియన్ లతో వారంలో ఐదు రోజులు బ్యాంకింగ్ కోసం జరిగిన ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా తొక్కు పెట్టిందన్నారు. కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తం బ్యాంకులవారీగా సాధించిన ఫలితాలను బట్టి ఆ బ్యాంకుల్లో కింది నుంచి పైదాకా అమలు చేయాలని డిమాండ్ చేశారు.బ్యాంకు ఉద్యోగులు ఇతర కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి తిప్పుకొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని అన్నారు దీంట్లో భాగంగా సెప్టెంబర్ 11 జరిగే సమ్మెలో సిఐటియు ప్రత్యక్షంగా పాల్గొని డిమాండ్లు పరిష్కారాన్ని కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ అచ్యుతాపురం మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు బ్యాంకు ఉద్యోగులు గోవిందు, జగదీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.