
జనం న్యూస్ బిచ్కుంద మే 21 కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజుల్లా గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం వానకాలానికి ముందు శాస్త్రవేత్తల యొక్క సలహాలు సూచనలు రైతులకు నేరుగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శాస్త్రవేత్త ఫాతిమా తబస్సుమ్ రైతులకు పంటలపై వివిధ సూచనలు చేయడం జరిగింది. సోయాబీన్ మరియు కంది పంటలలో రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన చీడపీడలు కాండం తొలిచే ఈగ, పల్లాకు తెగులు, ఎండు తెగులు, మారుక మచ్చల పురుగు నివారణకు తప్పకుండా విత్తన శుద్ధి తెసుకోవాలని రైతులకు వివరించడం జరిగింది. వానాకాలం సాగుకు ఎంచు కోవాల్సిన వరి రకాలు వివరించడం జరిగింది, యూరియా మరియు ఇతర రసాయనిక ఎరువులు అధిక మోతాదులో వాడడం వల్ల కలిగే నష్టాలు వివరిస్తూ యూరియాకు ప్రత్యామ్నయాలు రైతులకు వివరించడం జరిగింది, రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి బదులుగా సేంద్రియ పద్ధతులు మరియు సేంద్రియ ఎరువులు వాడుకోవాలని సూచించడం జరిగింది, పంటలు కోసిన తర్వాత మిగిలిపోయిన పంట వ్యర్థాలను కాల్చడం వల్ల జరిగే నష్టాలను రైతులకు వివరిస్తూ వాటిని నెలలో కలియ దున్నడం వల్ల కలిగే లాభాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డా. ఫాతిమా తబస్సుమ్ , గ్రామ సర్పంచ్ సాదువార్ జయశంకర్ , ఉప సర్పంచ్ అజయ్ పటేల్ , మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి శివలింగ్ మరియు రైతులు పాల్గొన్నారు.