
జనం న్యూస్ మే 27, వికారాబాద్ జిల్లా,పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులకు 50 శాతం సబ్సిడిపై పచ్చిరొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి. హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు,స్థానిక నాయకులతో కలిసి రైతులకు పచ్చిరొట్టె విత్తనాలను పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించి పంటల దిగుబడులు పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.అనంతరం పరిగి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే, స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు,ఆత్మ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, డైరెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.