
జనం న్యూస్ ఆగస్టు 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చెన్నాపూర్ క్రాస్ రోడ్ నుండి
మంగళవారం ఉదయం: 8:00 గంటలకు చెన్నాపూర్ క్రాస్ రోడ్ వద్ద చలివాగు ప్రాజెక్ట్ నుండి రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నాయకత్వంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది.రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఐక్యంగా పాల్గొని రైతుల గొంతుకగా నిలవండి.కావున ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రైతుల హక్కుల కోసం నిర్వహిస్తున్న ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయవలసిందిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు.