
జుక్కల్ జూన్ 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో రైతు వేదికలోరైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి వ్యవసాయ అధికారి కిషన్నాణ్యమైన విత్తనం అధిక దిగుబడికి పునాది అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శామప్ప పటేల్ అన్నారు. గురువారం రోజున మండలంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శామప్ప పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన మేళాలో గల ఉత్పత్తులను పరిశీలించారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదిక పై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు.రైతు వేదికలలో నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాల్లో సన్న వడ్లు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరి యా, నానో డిఏపి వంటి ఆధునిక వ్యవ సాయ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు.అనంతరం వ్యవసాయ అధికారి కిషన్ మాట్లాడుతూవర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో యూరియాను అధిక మోతాదులో వినియో గించడం వల్ల భూసారం దెబ్బతింటుందని,శాస్త్రీయ పద్ధతుల్లో ఎరువులను వినియోగించాలని రైతులకు సూచించారు. ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉండేలా తగిన నిల్వలు ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటారు. అలాగే మహిళా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి, నిర్వహణ, విక్రయాల తీరును పర్యవేక్షించి, కేంద్రం మరింత సమర్థవంతంగా పనిచేసేలా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.