
జనం న్యూస్ 02 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సింధనూర్ గ్రామంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ మహేశ్వర్ రెడ్డి, గత నాలుగు నెలల నుండి రైతులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. మేనేజర్ రెన్యువల్ చేయకుండా ప్రతిరోజు బ్యాంకు చుట్టూ తిప్పుకుంటున్నాడు కొంతమంది రైతులు మేనేజర్ ను గట్టిగా అడిగితే నీకు రెన్యువల్ చేయలేను అంటూ గట్టిగా చెప్పడం జరిగింది. పక్క రాష్ట్రం కర్ణాటక లో ఉన్నటువంటి రైతులకు లోన్లు ఇస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు. తెలంగాణ గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతుకు రుణం ఇవ్వాలని చెప్తున్నప్పటికీ బ్యాంకు మేనేజర్ మాత్రం ఇవ్వడం లేదు దీనికి రైతులు ఆవేదన చెందుతున్నారు.సింధనూరు,తొత్తినోని దొడ్డి,కుట్కనూరు బోయలగూడెం ఇందువాసి కొత్తపల్లి లింగాపురం ముగోనిపల్లి బైనపల్లి తలమారి కర్ణాటక ఇక్కడ సింధనూరు శివారులో ఉన్నటువంటి వాళ్లకు కూడా గత 35 సంవత్సరాల నుండి ఇస్తున్నాడు బ్యాంక్ మేనేజర్లు ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ ఎవ్వరికి స్పందించడం లేదు ఫీల్డ్ ఆఫీసర్ ముఖ్యంగా చాలా ఇబ్బంది పెడుతున్నాడు రైతుల కష్టాలతో ఆడుకుంటున్నాడు గ్రామ సంఘాలకు రెన్యువల్ లోన్స్ చేయలేకపోతున్నారు. దీనికి ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.