
జనం న్యూస్ ; 4జూన్ గురువారం ; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;హరే కృష్ణ సత్సంగం, ఇస్కాన్ సిద్ధిపేట వారి ఆధ్వర్యంలో ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ వివిధ ప్రాంతాల్లో భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో దద్దోజనం, రంగ తీర్థం వంటి శీతల ప్రసాదాలను భక్తులకు అందజేస్తున్నారు.ఈ కార్యక్రమానికి హరే కృష్ణ ట్రస్ట్‌కు చెందిన శ్రీ రంగ తీర్థ దాస్ నాయకత్వం వహిస్తూ ప్రసాదాల తయారీ మరియు పంపిణీ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు.ఈ రోజు నిర్వహించిన ప్రసాద పంపిణీ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సిహెచ్ మచ్చేందర్, ప్రభుదాస్ , పెద్ది మనోహర్ , శ్రీనివాస్ పాల్గొని సేవలందించారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఉపశమనం కలిగిస్తూ ఇస్కాన్ సిద్ధిపేట సమాజ సేవలో ముందంజలో నిలుస్తోంది.