
జనం న్యూస్ ఆగస్ట్ 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం శిలాంపల్లి రైతు వేదికలో మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రైతులకు ఎరువుల పంపిణీలో నూతన అధ్యాయం కేంద్ర ప్రభుత్వం ఎఫ్ ఎఫ్ ఎస్ వ్యవస్థ అమలు రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో పారదర్శకంగా అందించడంతో పాటు ఎరువుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని లక్ష్యంతో భారత ప్రభుత్వం ఎఫ్ ఎఫ్ ఎస్ అనే నూతన డిజిటల్ ప్లాట్ఫారం దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది ఈ వ్యవస్థ ద్వారా చెరువుల కొనుగోలు పంపిణీ నిలువలు సబ్సిడీ విక్రయాల పర్యవేక్షణ తదితర ప్రక్రియలన్నీ ఒకే వేదికపై నిర్వహించబడునున్నాయి ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఎఫ్ ఎఫ్ ఎస్ వ్యవస్థలో యూరియా డి ఏ పి ఎంఓపి ఎంపికే కాంప్లెక్స్ ఎరువులు సహా అన్ని సబ్సిడీ 20 ద్వారా విక్రయాలు ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా నిర్వహించబడతాయి రైతులు ఎరువులు పొందే విధానం రైతులు ముందుగా తమ మొబైల్ నంబర్ అవసరమైన వివరాలతో ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ లో నమోదు చేసుకోవాలి అనంతరం సాగు పంట విస్తీర్ణం అవసరమైన ఎరువుల వివరాలను నమోదు చేసి సమీపంలోని ఎరువుల డీలర్‌ను ఎంపిక చేసుకోవాలి అనంతరం ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ రైతుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ను రూపొందిస్తుంది రైతు ఎంపిక చేసిన డీలర్ వద్దకు వెళ్లి ఆ క్యూఆర్ కోడ్‌ను చూపించాలి డీలర్ ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ లేదా పరికరం ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత రైతు వివరాలు ఎరువులు వివరాలు ధ్రువీకరించబడతాయి అనంతరం రైతుకు ఎరువులు అందజేయబడతాయి విక్రయం పూర్తయిన వెంటనే ఆ సమాచారం కేంద్ర ఎఫ్ ఎఫ్ ఎస్ సర్వర్‌లో నమోదు అవుతుంది దీంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎరువుల పంపిణీ రియల్ టైంలో పర్యవేక్షించగలుగుతాయి రైతులకు కలిగి ప్రయోజనాలు ఎరువుల కోసం అనవసరంగా వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది పారదర్శకమైన పంపిణీ వ్యవస్థ ద్వారా సరైన రైతుకు సరైన ఎరువు అందుతుంది ఎరువుల లబ్ధితమై స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంటుంది కావున రైతులు ఎలాంటి అపోహాలు లేదా సందేహాలకు గురికాకుండా ఎఫ్ ఎఫ్ ఎస్ వ్యవస్థకు సహకరించి ఎరువులు కొనుగోలు చేయాలని కోరుతున్నారు ఇతర వివరాలపై ఏవైనా సందేహాలు ఉంటే తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి ఏ ఈ ఓ సంప్రదించగలరు ఈ కార్యక్రమంలో ఏవో రాజశేఖర్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ ధర్మారెడ్డి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వంశీ, కృష్ణవేణి రైతులు సుభాష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు