
సమయానికి డాక్టర్లు , వ్యాక్సిన్లు అందడం లేదని మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే భగత్
జనం న్యూస్ -జూలై 29- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని బుధవారం నాడు ఆకస్మికంగా సందర్శించి రోగులతో మాట్లాడి వాళ్ళ తెలుసుకున్న నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్..ఈ సందర్భంగా రోగులతో మాట్లాడుతూ విస్తుపోయే నిజాలను వారి వద్ద నుంచి అడిగి తెలుసుకున్నారు, డాక్టర్లు సమయపాలన పాటించకపోవడంతో పాటు, అత్యవసర సేవలకు వినియోగించాల్సిన మందులను అందుబాటులో లేవని తెలుసుకొని స్టాక్ రిజిస్టర్ లను, ఇండెంట్ పెట్టిన మందులను స్టోర్ రూమ్ లో పరిశీలించారు.హాస్పిటల్ ను సందర్శించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ తో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బాలింతలకు అందించిన కెసిఆర్ కిట్టుగాని, అప్పుడే పుట్టిన బిడ్డలకు అందాల్సిన వ్యాక్సిన్లు గాని అందుబాటులో ఉండడం లేదని, డాక్టర్లు ఎవరు సమయపాలన పాటించకుండా అత్యవసర సేవలకు అందుబాటులో ఉండడం లేదన్న విషయాన్ని ఆయన ఆయన దృష్టికి తీసుకొచ్చారు రోగులు.అనంతరం నోముల భగత్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాయకులు చేతులో కత్తెర్లు పట్టుకొని బిఆర్ఎస్ పార్టీ హయాంలో నిర్మాణం చేపట్టిన భవనాలను ప్రారంభించ డానికి మాత్రమే తిరుగుతున్నారన్న విషయాన్ని కత్తెర్ల కాంగ్రెస్ అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని హంగు, ఆర్భాటాలకు వృధా చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు వైద్యం అందించడానికి ఖర్చు చేస్తే బాగుంటుందని, గతంలో బాలింతలకు అందించిన కెసిఆర్ కిట్టు లాంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చుకొని అయినా పేదలకు సంక్షేమ పథకాలను అందించాలని హితవు పలికారు . రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే పేదల కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ముందు ధర్నా చేయడానికి కూడా బిఆర్ఎస్ పార్టీ ముందుంటుందని మండిపడ్డారు నోముల భగత్.ఈ కార్యక్రమంలో చెన్ను సుందర్ రెడ్డి, హీరే కార్ రమేష్ జి, లక్మాల మధు బాబు,మహమ్మద్ గని, యాల విజయ్, సయ్యద్ మక్సుద్, కోడా విజయ్, ఆదాసు విక్రమ్, బండారు లక్ష్మీనారాయణ, జిలాని, కోడా కోదండ, నజీర్, మంద శాంతకుమారి, రఫీ,లక్ష్మణ్ నాయక్, అర్జున్ నాయక్, మహేష్ నాయక్, ధారా రవి, బహదూర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.