
జనం న్యూస్ జూలై 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : మాజీ ఎమ్మెల్యే, ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగా 79వ జయంతి సందర్భంగా కేపీహెచ్‌బీ టెంపుల్ బస్ స్టాప్ వద్ద శనివారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా ప్రజల హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. సమాజ సేవ, ధైర్యసాహసాలు, ప్రజల పట్ల ఆయన చూపిన అంకితభావం నేటి యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.కార్యక్రమంలో కూకట్పల్లి ఏఎంసీ చైర్మన్ పుష్ప రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, నాయకులు గంధం రాజు, రంగమోహన్, కరుణాకర్, భరత్, అరవింద్ రెడ్డి, కిలారు శ్రీనివాస్ బాబు, రాజేష్ గౌడ్, నళినీకాంత్, బాలరాజు, రాము, నవీన్, కామినేని వాసు, వనజ, సుజాత, వాణి, అరుణ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించగా, మోహనరంగా ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని పలువురు నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.