
జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వివిధ మండలంలోని తిరుగుతూ రైతుల వరి ధాన్యం బస్తాలను దొంగిలిస్తున్న ఎనిమిది మంది దొంగలను శాయంపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు అని పరకాల ఏసిపి సతీష్ బాబు అన్నారు అనంతరం శాయంపేట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో ఏసిపి సతీష్ బాబు మాట్లాడుతూ చిన్న దామెర ప్రతీక్ జీడి రాహుల్ షేక్ ఆస్లాం కోడేపాక హేమంత్ కుమార్ బిష్ట అనితతో పాటు ముగ్గురు మైనర్ బాలురు కలిసి ముఠాగా ఏర్పరచుకొని ఐనవోలు కమలాపూర్ దామెర హసన్ పర్తి శాయంపేట మండలంలోని రైతుల వడ్ల కళ్లాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు. పాల్పడ్డారు అని తెలిపారు నిందితులు అర్థరాత్రి.వేళల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వెళ్లి వడ్ల బస్తాలను ఎత్తుకెళ్లి హన్మకొండ లో నిల్వ చేసి అనంతరం గీసుకొండ మండలంలోని గొర్రెకుంట శివారులో రైస్ మిల్లుకు తరలించి విక్రయించినట్లు తెలిపారు మొత్తం 242 వరి ధాన్యం బస్తాలను దొంగతనం చేశారని సుమారు వాటి విలువ రూపాయలు 3.26 లక్షలు ఉంటుందని ఇటీవల మరో దొంగతనంకు పాల్పడేందుకు రెండు కార్లలో శాయంపేట మండలంలోని వసంతాపూర్ వైపు వెళ్లే నేపథ్యంలో మండలంలోని కొప్పుల బ్రిడ్జి సమీపంలో ఎస్సై జక్కుల పరమేశ్వర్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను ఎస్సై జక్కుల పరమేశ్వర్ వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా పలు మండలాల్లో నమోదైన దొంగతనం కేసుల్లో నిందితులని గుర్తించి నిందితుల వద్ద నుండి రూ.3.05.200 నగదు ఆరు సెల్ ఫోన్లను రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసులో శాయంపేట సి ఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది చాకచక్యంగా విధులు నిర్వహించి నిందితులను పట్టుకోవడం గర్వకారణమని నేరాల నియంత్రణలో మా యొక్క పోలీసులు అప్రమత్తంగా పనిచేస్తూ గ్రామ ప్రజల ఆస్తుల రక్షణకు కట్టుబడి ఉన్నారని ఏసిపి సతీష్ బాబు అన్నారు ఈ కేసును విజయవంతంగా పూర్తి చేసినందుకు సిఐ సుధాకర్ రెడ్డి ఎస్సై జక్కుల పరమేశ్వర్ తో పాటు పోలీస్ సిబ్బందిని ఏసిపి సతీష్ బాబు ప్రత్యేకంగా అభినందించారు...