

-- ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రేవంత్ నాథన్
బిచ్కుంద సెప్టెంబర్ 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆధ్వర్యంలో వరి పంటలో సమగ్ర పంట యాజమాన్యం పై రైతు బడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రైతు బడి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, మాల్తుమ్మెద శాస్త్రవేత్త డా. రేవంత్ నాథన్ మాట్లాడుతూ వరి పంటలో విత్తనాలు వేసుకునే దశ నుంచి పంట కోత వరకు వరి పంటలో చేపట్టవలసిన వివిధ యాజమాన్య పద్ధతులు వివరించారు. వరి పంటలో సమగ్ర కలుపు యాజమాన్యం, సమగ్ర నీటి యాజమాన్యం, సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. వరి పంటలు అధిక దిగుబడులు సాధించుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి దయానంద్ మరియు రైతులు పాల్గొన్నారు.