
జనం న్యూస్ జూన్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వర్షాకాలం ప్రారంభమై వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు,వృద్ధులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడు తున్నాయని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ పేర్కొన్నారుజ్వరాలు, జలుబులు, వైరల్ వ్యాధులు, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున cmc అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన కోరారుఈ సందర్భంగా సిఎంసి మోసాపేట్ జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తూ కింది అంశాలపై అత్యవసర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారుకాలనీలు, రహదారులపై మురుగునీరు నిల్వ ఉండకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలిడ్రైనేజీలు పొంగిపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచే కార్యక్రమాలు నిర్వహించాలిదోమల నివారణకు ఫాగింగ్, దోమల మందు పిచికారీ నిరంతరం చేపట్టాలి తెగిపోయిన విద్యుత్ కేబుల్స్‌ను వెంటనే మరమ్మతు చేసి ప్రమాదాలు నివారించాలి రాత్రివేళల్లో వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలివర్షాల కారణంగా విరిగిన చెట్ల కొమ్మలను తొలగించి రవాణాకు అంతరాయం లేకుండా చూడాలిస్కూల్ బస్సులు, విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీల్డ్ స్థాయిలో అధికారుల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలిప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా అధికారులు అత్యవసరంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని గాదె శివ కోరారు