
జనం న్యూస్ జూన్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : నగరంలో వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజల భద్రతతో పాటు వాహనాల రాకపోకలు అంతరాయం కలగకుండా కూకట్పల్లి ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ (L&O) విభాగం, ట్రాఫిక్ విభాగం అధికారులు సంయుక్తంగా ట్రాఫిక్ క్లియరెన్స్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్ల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. వర్షాల కారణంగా ఏర్పడే ట్రాఫిక్ అంతరాయాలను తగ్గించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) సూచించారు. వర్షాల సమయంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.