
జనం న్యూస్ 15 జూలై వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు సంప్రదాయ పద్ధతిలో కప్పకు పూజలు చేసి, గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి వర్ష దేవుడిని ప్రార్థించారు. అనంతరం గ్రామమంతా పాటలు పాడుతూ వర్షాలు కురవాలని వేడుకున్నారు. మంచి వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని, రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు