
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా .నందలూరు మండలం లో దివ్యాంగ శక్తి ఉచిత బస్సు పాసుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన - చమర్తి జగన్ మోహన్ రాజు దివ్యాంగులకు ఇంటి వద్దనే బస్సు పాసుల పంపిణీ.దివ్యాంగులకు సమయంతో పాటు వ్యయ ప్రయాసలు తగ్గించాం.దివ్యాంగులతో పాటు సహాయకుడి కూడా 50% రాయితీతో ప్రయాణం చేసే అవకాశం.నందలూరు మండలం నియోజకవర్గ పార్టీ కార్యా లయం.రాజంపేటపట్టణంఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేపట్టిన "దివ్యాంగ శక్తి" పథకం దివ్యాం గుల పాలిట వరంగా మారిందని తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. గురువారం నాడు నందలూరు మండలం నందు పర్యటిస్తూ స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు అధికారులు మరియు పార్టీ నాయకులతో కలిసి దివ్యాం గులకు ఉచిత బస్సు పాసులను చమర్తి జగన్ మోహన్ రాజు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ నిస్వా ర్థంగా సేవ చేస్తున్న చంద్రబాబు దారి చూపిస్తే దారిలోని చిన్న చిన్న గులకరాళ్ళను తొలగించి సహాయాన్ని సంపూర్ణంచేశా మన్నారు.అంతే కాకుండా ఆయన మాట్లాడుతూ నియో జకవర్గ వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నాయకులు/కార్య కర్తలు స్వయంగా దివ్యాం గులై ఇండ్ల వద్దకే వెళ్లి కావలసిన పత్రాలనుసేకరించారన్నారు.అదేవిధంగా నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకొని దివ్యాంగులకు పాసులను సకాలంలో అందేలా పనిచేయడం జరిగిందన్నారు.అనంతరం ఆయన మాట్లా డుతూ దివ్యాంగులకు సమ యంతో పాటు వ్యయ ప్రయా సలుకూడాతగ్గించామన్నారు.అంతేకాకుండా దివ్యాంగులతో పాటు ప్రయాణం చేసే సహాయ కుడికి కూడా టికెట్లు 50% రాయితీ ఇవ్వడం జరుగుతుం దన్నారు.అంతకు ముందు దివ్యాంగులు మాట్లా డుతూ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు దివ్యాంగులైన మాపై ప్రత్యేక చొరవ చూపి సొంత నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కో బస్ పాస్ కు ₹100 చొప్పున చెల్లించి అంద జేయడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పసుపులేటి ప్రవీణ్ కుమార్ మండల అధ్యక్షులు జంగంశెట్టి సుబ్బయ్య,మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు ,టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎద్దుల సాగర్, పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.