
జనం న్యూస్ 4 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణ కేంద్రంలోని మిల్క్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు శనివారం రోజున విద్యార్థి యువజన సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మాజీ టేస్కుబ్ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో విద్యార్థులు ఉద్యోగులు మోసపోయారని ఆరోపిస్తూ భారీగా విద్యార్థుల తో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు చేయకపోవడం రెండు లక్షల ఉద్యోగాల హామీని విస్మరించడాన్ని నిరసిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి పట్టణ మండల అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు