
జనం న్యూస్ సెప్టెంబర్ 4, వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం లోని ఎంకెపల్లి గ్రామంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్ కె వి వై) కేంద్ర ప్రభుత్వం పథకంలోని నేల ఆరోగ్యం, భూసార ప్రాముఖ్యతపై ఎంకెపల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థినీ, విద్యార్థులకు అదే పాఠశాలలో భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్ య అతిథులుగా రంగారెడ్డి జిల్లా భూసార పరీక్ష కేంద్రం, రాజేంద్రనగర్ వ్యవసాయ అధికారులు ఎ. సునీత, కే రాజేష్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భూమి యొక్క నాణ్యతను, భూమిలో ఉన్న పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కార్బన్ వంటి పోషకాలతో పాటు భూమిలోని ఆమ్లత్వం (పీహెచ్), ఎలక్ట్రికల్ కండక్టివిటీ (ఇసి) తదితర అంశాలు తెలుసుకునే విధానాన్ని విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా పరీక్షలు చేసి చూపించారు. భూమిలో పెరుగుతున్న కాలుష్యాన్ని, భారీ లోహాల కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి, భూమికి అవసరమైన పోషక విలువలను ఏ విధంగా అందించాలి అనే అంశాలను కూడా ప్రయోగపూర్వకంగా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సరళ , సైన్స్ ఉపాధ్యాయురాలు మీను సింగ్, బాటనీ ఉపాధ్యాయురాలు మాధవి మరియు ఇతర ఉపాధ్యాయురాలు జెబ్బునీస, కళావతి, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.