
జనం న్యూస్- ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు సోమవారం అవసరమైన భోజన సామాగ్రినీ పంపిణీ చేశారు.వసతి గృహ వార్డెన్ షేక్ మహమూద్ విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి భోజన సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు ఫహిమ, జ్యోతి విద్యార్థులకు సామగ్రిని అందించారు.విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగకరమైన సామగ్రిని అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.