
జనం న్యూస్ జూన్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం యువకులు, విద్యార్థులు డ్రగ్స్ రహిత సమాజంగా మార్చాలని సీఐ సుధాకర్‌రెడ్డి అన్నారు.అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమరవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. యువకులు, విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసకావొద్దని తెలిపారు అనంతరం ఎస్సై జక్కుల పరమేశ్వర్ మాట్లాడుతూ యువకులు,విద్యార్థులు మాదకద్రవ్యాలకు లోనుకాకుండా చూసే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.ఎవరైనా మాదకద్రవ్యాలను విక్రయించినా, రవాణా చేసినా ఈగల్ ఫోర్స్ డయల్ 1908 లేదా8712671111వాట్సాప్ లో గాని సమాచారం ఇవ్వాలని కోరారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం-ఆరోగ్యంపై
ప్రభావాలు వాలిపోస్టర్లను ఆవిష్కరించారు. క్రీడలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రేవతి, ఉపాధ్యాయులతో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు……