
జనం న్యూస్ జూలై 17 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదు రోజువారి హాజరును పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని మండల విద్యాధికారి విట్టల్ ఒక ప్రకటనలో తెలియజేశారు ప్రతి ఉపాధ్యాయుడు తమ పాఠశాల పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి బడికి రాని పిల్లలను గుర్తించి వెంటనే పాఠశాలలు చేర్పించాలని అలాగే ఇప్పటికే నమోదైన విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని కోరారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విధితో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ లు మధ్యాహ్న భోజనం ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు ప్రతి పాఠశాల విద్యార్థుల నమోదు హాజరు శాతాన్ని ప్రతిరోజు సమీక్షించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని తెలిపారు విద్య చిన్నారి హక్కు అని ప్రతి విద్యార్థి బడిలో ఉండేలా అందరూ సమస్యలు చేయాలని సూచించారు