
బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి స్థల పరిశీలన
జనం న్యూస్-ఆగస్టు 3- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ బిసి గురుకుల పాఠశాల వద్ద విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సోమవారం రోజున నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాజా ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేపట్టారు. పాఠశాల ముందు ఉన్న ప్రధాన రహదారిపై నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో రోడ్డు దాటే సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న విషయం తెలుసుకొని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి చొరవతో నల్లగొండ ఎంపీ నిధుల నుంచి 47 లక్షల రూపాయలను ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం మంజూరు చేయించారని నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాజా ప్రసాద్ తెలిపారు,గతంలో జరిగిన కొన్ని ఘటనలను ,స్థానికులు మరియు విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే చొరవతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లుగా ఆయన తెలిపారు. వంతెన నిర్మాణానికి అనుకూలమైన స్థలం పిల్లలు సురక్షితంగా బ్రిడ్జి పైకి ఎక్కి దిగేందుకు వీలైన మార్గాలను సంబంధిత అధికారులతో కలిసి ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రవికుమార్ ,నందికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్లు పగడాల నాగరాజు,చందు నాయక్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.