
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో 10 కే రన్
జనం న్యూస్- మే26- నాగార్జునసాగర్ టౌన్ : స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్. పి. ఎఫ్) డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, జోన్ డి ఐ జి మాధవరావు ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ 99 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎస్. పి. ఎఫ్ ఆధ్వర్యంలో పైలాన్ పిల్లర్ నుండి హిల్ కాలనీ డౌన్ పార్క్ వరకు 10 కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు , ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ లు ప్రతాప్ నాయుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్పీఎఫ్ సిబ్బంది ఫిట్నెస్ సరిగ్గా ఉన్నప్పుడే విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించగలుగుతారని అన్నారు,దీనితోపాటు శారీరక దారుఢ్యం కోసం పలు రకాల ఫిజికల్ ఎక్సర్సైజులు నిర్వహించారు, ఎస్ పి ఎఫ్ సిబ్బంది నిత్యం తమ ఫిట్నెస్ పై దృష్టి సారించాలని ఫిట్నెస్ సరిగ్గా ఉన్నప్పుడే చురుగ్గా తమ విధులలో పాల్గొనగలుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెన్కో ఎస్ పి ఎఫ్ అధికారులు, సిబ్బంది, నాగార్జునసాగర్ డ్యాం ఎస్ పి ఎఫ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.