
జనం న్యూస్ ;7 ఏప్రిల్ గురువారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;విద్యావర్థిని స్కూల్కు చెందిన విద్యార్థులు ఎస్.ఎస్.సీ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. యు. హర్షిత్ 582 మార్కులు, ఎండి హమారానుద్దీన్ 579 మార్కులు, ఎన్. సంజన 562 మార్కులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ బి. మోహన్ కుమార్ మాట్లాడుతూ, విజేత విద్యార్థులను సన్మానించి అభినందించారు, “విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాము” అని తెలిపారు.