
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు చేపల యజ మానులు కూలీలతో వెట్టి చాకిరి చేయిస్తే కఠిన చర్యలు తప్పవని రాజంపేట ఏఎస్పి మనోజ్ రామ్నాథ్ హెగ్డే హెచ్చరించారు. శుక్రవారం నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ అరవపల్లెలోని ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో చేపల యజమానులు, కూలీలతో ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు పనిలో చేరేటప్పుడు తప్పకుండా వారి వ్యక్తిగత సమాచారం, కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలని అని అన్నారు. అదేవిధంగా కూలీల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో సమర్పిం చాలని అన్నారు. కూలీలను అక్రమంగా నిర్బంధించడం నేరమని అన్నారు.