
జనం న్యూస్ : భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు నేడు భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ వారికి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల ఉండాలని కుండలేశ్వరం క్షేత్రంలో గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలందించిన నాయకుడిగా నరేంద్ర మోదీ కొత్త చరిత్ర సృష్టించారు. ఆయన ప్రధానమంత్రిగా 4,399 రోజులు పూర్తి చేసి, భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి 4,398 రోజుల రికార్డును అధిగమించారు.ఈ చారిత్రాత్మక సందర్భంగా బిజెపి ప్రముఖ కార్యకర్తలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామంలో పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారు సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో దేశానికి మరింత సేవ చేయాలని భగవంతుని ప్రార్థించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారు నాయకత్వంలో దేశం మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రగతి, డిజిటల్ విప్లవం మరియు అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపును సాధించిందని పేర్కొన్నారు. దేశాభివృద్ధి పట్ల ఆయన అంకితభావం కోట్లాది భారతీయులకు, పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు.దేశ ప్రజలు అందిస్తున్న అపారమైన ఆదరణకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు(బాబీ మాస్టర్), జిల్లా బిజెపి కోశాధికారి గ్రంధి సూర్యనారాయణ గుప్త( నానాజీ ), జిల్లా కార్యవర్గ సభ్యులు రాయపురెడ్డి భైరవమూర్తి , ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్లకోటి వెంకటరెడ్డి, ముమ్మిడివరం టౌన్ బిజెపి అధ్యక్షుడు సన్నిధిరాజు వీరభద్ర శర్మ, ఐ .పోలవరం బిజెపి అధ్యక్షుడు సఖిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు