
జనం న్యూస్, ఆగస్టు 28:రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ అమిత రాజపూర్ణానందం దంపతులు శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన ఆశీస్సులు పొందారు.ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో తమకు ఉన్న ఆత్మీయ అనుబంధానికి రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రతీకగా నిలుస్తున్నాయని అమిత రాజపూర్ణానందం దంపతులు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్నాచెల్లెళ్ల అనుబంధంతో కొనసాగుతున్న ఈ ఆత్మీయ బంధం తమకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. “వేముల ప్రశాంత్ రెడ్డి అన్నగారి ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష. ఆయన ప్రేమ, ఆప్యాయత, ప్రోత్సాహం ఎప్పటికీ మా వెంట ఉండాలని కోరుకుంటున్నాం” అని వారు అన్నారు.అదేవిధంగా ఏర్గట్ల మండల అధ్యక్షుడైన ఏనుగందుల రాజపూర్ణానందం మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.