
జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలందివంగత మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల ప్రధాత వైస్సార్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలో వైయస్సార్ ప్రవేశపెట్టారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి చారిత్రాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్ ది అని అన్నారు . ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మారపెల్లి రవీందర్, చల్లా చక్రపాణి దుబాస్ కృష్ణమూర్తి డిటి రెడ్డి కొమ్ముల సదానందం మారపల్లి కటయ్య లడే రాజ్ కుమార్, రామ్ రెడ్డి మసికే కుమార్, రంగు బాబు తదితరులు పాల్గొన్నారు…..