
ఆక్సిజన్ అందక నవజాత శిశువు మృతి
కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జనం న్యూస్ మోహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ బ్యూరో ఇంచార్జ్ తేదీ 06-07-2026జహీరాబాద్ టౌన్: ప్రభుత్వ ఆస్పత్రికి డెలివరీ కోసం వెళ్లిన గర్భిణికి నర్సులు, ఆయాలు కాన్పు చేయగా ఊపిరాడక శిశువు మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరా బాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఝరాసంగం మండలం పొట్‌పల్లికి చెందిన సుదర్శన్ భార్య శోభ గర్భవతి కావడంతో ప్రతి నెలా జహీరాబాద్ ఆస్పత్రిలో చూపించు కుంటున్నారు. ఆదివారం పురిటినొప్పులు రావడంతో భర్త, కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. సమ యానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీలో ఉన్న నర్సు, ఆయాలు కలిసి ఆమెకు డెలివరీ చేశారు. కాన్పు పూర్తయిన తరువాత బిడ్డ పరిస్థితి ఒక్కసారిగా విషమించిం ది. అత్య వసరంగా పెట్టడానికి కనీసం ఆక్సిజన్ కూడా లేక పోవడంతో ఊపిరాడక నవజాత శిశువు మృతి చెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడం తో టౌన్ పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. విషయం తెలుసు కున్న ఎమ్మెల్యే మాణిక్టావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు సంతోష్, అక్కడికి వచ్చి ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడారు.