
జనం న్యూస్; 16 జూలై గురువారం: సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై రమేష్; ఆషాడ మాస మహోత్సవ పూజల్లో భాగంగా సిద్దిపేట పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో వెలసిన శ్రీ మహా మైసమ్మ గురువారం శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అర్చకులు శాకాంబరీ దేవిగా అలంకరించారు.అషాడ మాసంలో వివిధ అవతారల్లో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్న నమ్మకంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.పూజా కార్యక్రమాలు అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కుంకుమ పూజ అన్నప్రసాదం పంపిణీ ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు పయ్వవుల రాజయ్య ప్రధాన కార్యదర్శి పంబాల యాదగిరి కోరారు