

శాయంపేట మండలం 27 ఆగస్టు 2026 ఈరోజు గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలంలో గట్లకనపర్తి, శాయంపేట & పెద్దకోడేపాక గ్రామాల రైతు వేదికలలో నిర్వహించిన కార్యక్రమాల్లో గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రతి అర్హత గల కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తోందని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయని అన్నారు.ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధికార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.