
జనం న్యూస్ మోహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ బ్యూరో ఇంచార్జ్ తేదీ 28-08-2026 జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామంలోని షేక్ షాబొద్దీన్ దర్గా ఉత్సవాలు ఈ నెల 29, 30 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా దర్గా జాతర ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా *మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు * హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసంలో కలిసి జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో *జహీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, గ్రామ సర్పంచ్ **చేస్మోద్దీన్, మాజీ సర్పంచ్ **చిన్నారెడ్డి, వార్డు సభ్యులు **సైఫోద్దీన్, చంటి, జాహెద్, షాకీర్ అలీ, నాయకులు *సాయి ప్రణీత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.