

శ్రావణమాసంలో రాచన్న స్వామి ఘనంగా
బిల్వార్చన పూజలు
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి. వీరేశం ఆగస్టు 24. 08. 2026 కోహిర్ మండలం బేడంపేట్ గ్రామంలోని రాచన్న స్వామి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా నెల రోజుల పాటు ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రావణమాసం ప్రారంభం నుంచి ఆలయంలో పత్రి బిల్వార్చన పూజలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 10 వేల నుంచి 11 వేల వరకు పత్రిలను స్వామివారికి సమర్పిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
గ్రామ సర్పంచ్ దయానంద్ ప్రతిరోజూ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ, పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రాచన్న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.అలాగే ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. భక్తులకు భోజన వసతి కల్పిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రావణమాసం మొత్తం నెల రోజుల పాటు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, పత్రి బిల్వార్చన, అన్నదాన కార్యక్రమాలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలతో బేడంపేట్ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.