
జనం న్యూస్ సెప్టెంబర్ 5ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం: ఐ.పోలవరం మండలం కొమరగిరి రామారావుపేటలోని శ్రీరామ మందిర నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విడుదలైన రూ.4.24 లక్షల నిధులను ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తన క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు మరియు కొమరగిరి గ్రామస్తులకు అందజేశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణానికి మొదటి విడతగా రూ.2 లక్షలు, రెండవ విడతగా రూ.2.24 లక్షలు, మొత్తం రూ.4.24 లక్షలు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో బుజ్జి కృష్ణరాజు, ఆకుల సత్తిబాబు, పెనుమత్స శరత్ రాజు, రాజేష్, కిషోర్ రాజు, దడాల చంటిబాబు, సూర్యనారాయణ, మద్దాల వెంకటేశ్వరరావు, కంకిపాడు దొరబాబు, మాధవ కృష్ణార్జున తదితరులు పాల్గొన్నారు.