
జనం న్యూస్ :1ఆగస్టు సోమవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్; శ్రీవాణి పాఠశాలలో శనివారం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే పరస్పరం మిఠాయిలు పంచిపెట్టుకొని స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి హెచ్. సత్యం మాట్లాడుతూ, “స్నేహం అనేది మనిషి జీవితంలో అత్యంత విలువైన బంధం. ఆపదలో అండగా నిలిచి, ఆనందంలో భాగస్వామిగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం, సహకారంతో కూడిన స్నేహం వ్యక్తిత్వ వికాసానికి బలమైన పునాది. విద్యార్థి దశలో ఏర్పడే మంచి స్నేహాలు జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా నిలుస్తాయి. ప్రతి విద్యార్థి మంచి స్నేహితుడిగా ఎదిగి సమాజంలో ఆదర్శప్రాయంగా నిలవాలి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.