
జనం న్యూస్ జూలై 7,వికారాబాద్ జిల్లా (పరిగి నియోజకవర్గం ఇంచార్జి హన్మంత్ రెడ్డి )ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి,ప్రతిమా రెడ్డి,కుమార్తె వినిషా రెడ్డి,కుమారుడు వర్షిత్ రెడ్డి,పరిగి నియోజకవర్గ బీఆరెస్ యువనాయకులు సంతోష్,అంబిక దంపతులతో కలిసి దర్శించుకొన్నారు.ఈ శ్రీశైల క్షేత్రంలో స్వామి,అమ్మవార్ల సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో వేద పండితుల చెత వారి ఆశీర్వచనలు పొందారు.మన పరిగి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సుకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు