
జనం న్యూస్ జూన్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వరనగర్ 35వ బ్లాక్లో ఉన్న శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం 19వ వార్షికోత్సవ వేడుకలు భక్తుల ఆధ్యాత్మిక సందడితో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రంగారావు, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాధవరం రంగారావును శాలువాతో సత్కరించి, కార్యక్రమానికి హాజరైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. వార్షికోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు మరియు భక్తులు పాల్గొన్నారు.