
జనం న్యూస్ జులై 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేటలోని కాకతీయుల కాలం నాటి శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయం నుండి సిసి రోడ్డు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ చింతల ఉమా రవిపాల్, శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయ చైర్మన్ సామల బిక్షపతి హాజరై సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బిక్షపతి మాట్లాడుతూ ఐదు లక్షలతో సిసి రోడ్డు పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో చేపట్టినట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, జిన్నా ప్రతాపరెడ్డి,జిన్నా కృపాకర్ రెడ్డి, బాసాని రవి వార్డు సభ్యులు కొత్తపల్లి రవీందర్, రాయరాకుల సుమన్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు….