
జనం న్యూస్ సెప్టెంబర్ 11 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శుక్రవారం జరిగినటు వంటి కార్యక్రమంలో భాగంగా చండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు 24 గంటల భజన కార్యక్రమం ప్రారంభం అయినది శ్రావణ మాసం ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండి వర్షాలు పడాలని ఈ కార్యక్రమాన్ని శ్రీ రామలింగేశ్వర భజన మండలి సభ్యులు చేపట్టారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉన్నది ఈరోజు ఉదయం ప్రారంభమైన భజన శనివారం ఉదయం 7:30కు నిమిషాలకు మూగియా నున్నదే గ్రామంలోని భజన మండలి సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు 24 గంటల భజన కార్యక్రమంలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి గ్రామ సర్పంచ్ శేషాద్రి ఉప సర్పంచ్ వెంకటేశం సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి నారి స్వామి భజన మండలి గురుభక్తులు అనంతం నారాయణ కిష్టయ్య సోమ మల్లేశం పాండురంగం తోపాటు వందల మంది భక్తులు పాల్గొన్నారు