
జనం న్యూస్ :28 ఆగస్టు శుక్రవారం : సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ :సిద్దిపేట పట్టణం భారత్ నగర్లోని శ్రీ వాణి స్కూల్లో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీక అని తెలిపారు. రాఖీ కేవలం ఒక దారం కాదని, సోదర సోదరీమణుల అనుబంధానికి గుర్తు అని వివరించారు. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవించు కుంటూ, ఆపదలో అండగా నిలవాలని సూచించారు. అనంతరం రాఖీ పండుగ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పరస్పరం రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అనంతరం విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టి “నాకు నువ్వు రక్ష.. నీకు నేను రక్ష.. మనం దేశానికి రక్ష” అనే సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.