
జనం న్యూస్ | జూలై 30 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి : శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ దేవి అమ్మవారి బోనాల జాతర మహోత్సవాలను పురస్కరించుకుని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగంను ఆలయ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి జాతరకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆహ్వానించారు.ఈ సందర్భంగా బోనాల జాతరను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ బీ-బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, ఆలయ కమిటీ చైర్మన్ రాచమల్ల బిక్షపతి గౌడ్, బోర్డు సభ్యులు పాండు ముదిరాజ్, నర్సింగ్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాచమల్ల శేఖర్ గౌడ్, రమేష్ గుప్తా, దాదే కిరణ్ తదితరులు పాల్గొన్నారు.జాతర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.